Tuesday, May 22, 2012

మన వెబ్సైటు గురించి

మీకూ సినిమా పిచ్చి ఉందా, దాన్ని ఇంకా పెంచుకోవాలని ఉందా, అయితే ఈ గ్రూప్ మీ సినిమా పిచ్చిని పిచ్చగా పెంచుకునే మహదవకాశాన్నిస్తుంది. మీకు నచ్చిన సినిమా విషయాల్ని పిచ్చి, పిచ్చిగా ఇక్కడ చెప్పేయండి. రచ్చ చేసేయండి...అయితే నిజాలు మాత్రమే సుమా, అబద్ధం ఆడటానికి మనం ఏమన్నా మంచోళ్లమా.

Note:ఈ గ్రూప్ కేవలం సినిమాలు గురించి డిస్కస్ చేసే రచ్చబండ మాత్రమే....తిట్టుకునే అసెంబ్లీ మాత్రం కాదు...పొలిటకల్ వాదాలు ఇక్కడ చేయద్దని మనవి.

“తెలుగు సినిమా పిచ్చోళ్లు” గ్రూపు సభ్యులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ పోస్టులు పెట్టొచ్చు ఏవి పెట్టకూడదు అనేది ఈ డాక్యుమెంట్ లో పొందు పరిచాము. ప్రతి సభ్యుడు దీన్ని చదివి, లైక్ ద్వారా తమ ఆమోదం తెలియజేయగలరు. చదివి ఇంకేమైనా సూచనలు,సలహాలు ఇవ్వండి...



ఈ గ్రూపు ప్రధాన ఉద్ధేశ్యం

తెలుగు సినిమాని ప్రేమించే వారందరిని ఒక తాటిమీదకి తేవటం

ఈ గ్రూపు వినోదం ప్రధానంగా, అందరు హాయిగా నవ్వుకోవటానికి ఉంది తప్ప బాధ పడటానికి, బాధ పెట్టటానికి లేదు.

అలాగే సినిమాలలో ఉన్న చెత్తను విమర్శించటానికి కూడా ఈ గ్రూపు ఎప్పుడూ ముందుంటుంది...అలాగని అదే పని మీద ఉండదు.



చెయ్యచ్చు

మీరు ఈ గ్రూపులో సినిమాల గురించి చర్చించ వచ్చు.

పాత, కొత్త సినిమాల్లో మంచి, చెడులను ఎత్తి చూపటం, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశేషాలను చర్చించటం, క్విజ్ లు నిర్వహించటం, పాటలు, సీన్స్ మొదలైనవి పోస్ట్ చేయటం, తెరవెనక ముచ్చట్లు, సినిమా నిర్మాణ సమయంలో జరిగే విశేషాలు (వ్యక్తిగత విమర్శలు లేనివి) ఈ గ్రూపులో షేర్ చేయొచ్చు.



చేయకూడనివి

వ్యక్తిగత విమర్శలు, సినిమాలకు సంబంధంలేని అంశాలు చర్చించటం, సినిమాలకు సంబంధం ఉన్న వివాదాస్పద అంశాలను చర్చించటం, రాజకీయ, కుల, మత, ప్రాంతాలకు సంబంధించిన అంశాలు పోస్టు చేయటం, వ్యక్తిగత ప్రకటనలను, లింకులను పోస్టు చేయటం మొదలైనవి చేయకూడదు.



ప్రయారిటీ

వినోదం, వ్యంగ్యం, సినీ విజ్ఞానం ఉన్న పోస్ట్ లకు......

ఈ గ్రూపు ఉన్నది మన ఆనందం కొరకే అన్నవిషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని గ్రూపు అభివృద్ధిలో సహకరిస్తారని ఆశిస్తున్నాము. మీ సలహాలు, సూచనలు అందజేయగలరు

No comments:

Post a Comment