Tuesday, May 22, 2012

డైరెక్టర్ శంకర్



డబ్బుతోనే సినిమాలు తీస్తారని అందరూ అనుకుంటారు .కాని ఆలోచన ఉంటె డబ్బు అదే వస్తుందని

" శంకర్ " కాన్ఫిడెన్సు .

శివాజీ సినిమాలో రజినీకాంత్ రూపాయి తో జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తాడు శంకర్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అతని చేతిలో ఆ రూపాయి కూడా లేదు.అప్పటికి శంకర్ వయసు 29 ఏళ్ళు ....చేతిలో చిల్లర మాత్రమే ఉండి టి నగర్ రోడ్లు మీద నడుస్తూ ఆలోచిస్తున్నాడు సినిమా ఫీల్డ్ కి వచ్చి ఏడేళ్ళు అయింది అసిస్టెంట్ డైరెక్టర్ గా 17 సినిమాల అనుభవం వచ్చేసింది 'ఇక సినిమాలు చేయను '... అన్నాడు శంకర్ ... !ఫ్రెండ్స్ ఆశ్చర్యపోలేదు ..చిలిపిగా నవ్వారు ..డైరెక్టర్ అయ్యే వయసొచ్చేసింది నీకు ... అంటూ ఆటపట్టించారు .. ఏ కథ రెడీ చేస్తున్నావ్ ..అడిగారు " రజిని .. ముళ్లుం మలరం " నాకు నచ్చిన సినిమా .. ఆ టైపు లో ఏదైనా చేద్దామా అని ... అంటున్టుండగా .... ఇంకో ఫ్రెండ్ మద్యలో కట్ చేసాడు 'మీసాల కుంజు మోన్ కథ వింటున్నాడు ... బిగ్ ప్రొడ్యూసర్ ..ట్రై చేయి ..' సలహా ఇచ్చాడు శంకర్ మౌనం లో ఓ సందేహం 'అంతవరకు మైయిన్టినేన్స్ ..ఎలా ?ఫ్రెండ్స్ నిలబడిపోయారు ..రూమ్ రెంట్ ఒకలిచ్చేసారు ..మెస్ బిల్ ఇంకొకళ్ళు ..శంకర్ కథ రెడీ చేస్తుంటే ..ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకున్నారు ..శంకర్ మైండ్ స్పీడ్ గా పనిచేస్తుంది ఒకేఒక్క ఛాన్స్ ... గన్ షాట్ గా గెలవాలి ...

" సారి " ...మొదటిసారి కథ చెప్పినప్పుడు వినడానికి ఎవ్వరు ఇష్టపడని మాట ఇది ..కుంజు మోన్ మీసాలు సర్దుకున్నారు తరవాత చెప్పారు ...నీకు ఛాన్స్ ఇస్తాను కాని ఈ కథ కాదు వేరే యాక్షన్ కథ ఏదైనా చేయి ...కుంజు మోన్ ఆఫీసు నుండి బయటకొచ్చేసాడు .. నెలల తరబడి కష్టం ... తను ఇష్టపడి మొదట సినిమా చేద్దామనుకున్న స్క్రిప్ట్ " అళగియ పుయలే " ( అందమైన తుఫాను ) వర్క్ అవుట్ కాలేదు ... అయినా నిర్మాత ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా ..అది చాలు ...ఈ సారి మిస్ కాను ..కసిగా అనుకున్నాడు ..మళ్లీ కథ మొదలైంది ... ఈ సారి " జెంటిల్మన్ "తయారైయింది ...

జూలై 16 1993 
-------------------
కుంజు మోన్ ఆఫీసు కిటకిటలాడుతోంది ... శంకర్ డైరెక్షన్ లో మొదటి సినిమా జెంటిల్మన్ ఆ రోజు రిలీజ్ .. ఫోన్లు గ్యాప్ లేకుండా మోగుతున్నాయి ..అన్ని ఏరియాల నుంచి ఒకటే రిపోర్ట్ ..సినిమా సూపర్ డూపర్ హిట్ హీరో అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ .. ఏ .ఆర్.రెహ్మాన్ ..పాటలు హిట్ , ప్రభుదేవా చికుబుకు రైలే...ఐటెం సాంగ్ హిట్ ...నిర్మాత కుంజు మోన్ తన బోర మీసాలు సవరించుకున్నాడు " నాకు ఇంకో సినిమా చేయాలి " చేతిలో అడ్వాన్సు పెట్టాడు ... పీచు మిఠాయి ..అర్ద రూపాయి ..నువ్వుకోరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయిలు ...పీచు మిఠాయి లాంటి ప్రేమ కథకయినా లక్షరుపాయిలే కావాలంటాడు శంకర్ ..ప్రేమకథ కు ఇంత బడ్జేట్టా ? ..అది ప్రభుదేవా లాంటి బక్కపల్చటి కుర్రాడు హీరోనా ?అదీ అతనితో లవ్ స్టొరీ నా ? ఒక్క పాటకి ఆద్దాలతో బస్ తయారు చేయిస్తాడా ..?ప్రేమికుడు సినిమా కోసం శంకర్ చేసే పని మీద విమర్శలే ..శంకర్ కి మాత్రమే తెలుసు ...తనేం చేస్తున్నాడో ...!1994 లో ప్రేమికుడు సినిమా రిలీజ్ అయింది ...కలెక్షన్లు రాప్ డాన్సు చేసాయి ... ఆ రోజుల్లోనే 23 కోట్లు రూపాయల కలెక్షన్లు శంకర్ మీద ఎంత ఖర్చుపెడితే అంత లాభం ..అతని మీద ఎంత రిస్క్ చేస్తే అంత రిజల్టు ..మూస ఫార్ములాతో ,వరస ఫ్లాప్ లతో చితికిపోయిన చిత్ర పరిశ్రమని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రీ ఛార్జ్ చేసాడు ...రెండు మెగా హిట్స్ తరవాత శంకర్ కి పొగరు పెరగలేదు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు జాగ్రత్తగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు ..తను కరెక్ట్ గా ఉండాలి ...అనుకున్నదే చేయాలి ...ఈ సారి ఎ.ఎం.రత్నం దగ్గరికి తనే వెళ్లి మీకో సినిమా చేస్తానని అడిగాడు .. శంకర్ కథ విన్నాడు రత్నం ..రజినీకాంత్ ,కమలహాసన్ లలో ఎవరైనా ఓకే అన్నాడు శంకర్ ..మొదట కమల్ కి కథ చెప్పారు శంకర్ ..ఆ కథని ఎలా తయారు చేసాడంటే ...కథ వింటున్నతసేపు కమల్ కి అది కథలా అనిపించలేదు ...చాలెంజ్ గా కనిపించింది ...కథ విని .. ఎస్ అన్నారు ..."మీకేమన్నా సందేహాలుంటే ఇపుడే చెప్పేయండి ..సెట్స్ లో ఇన్వాల్వ్ అయితే నేను సరిగా పనిచేయలేను " కమల్ కు ఖరాఖండి గా చెప్పాడు శంకర్ ..1996 లో రిలీజ్ అయిన " భారతీయుడు " సినిమాకి 13 కోట్ల రూపాయిలు ఖర్చయింది 32 కోట్ల రూపాయిలు వసూలు చేసింది కమర్షియల్ సినిమాకు కొత్త సక్సెస్ ఫార్ములాను సెట్ చేసింది " భారతీయుడు " సినిమా అంతకు ముందు సామాజిక రుగ్మతలు మీద సినిమాలు తీసిన దర్శకులు ఆర్ట్ సినిమా డైరెక్టర్ లుగా ముద్రపడ్డారు ..ఆ సినిమాలు స్లో సినిమాలుగా ముద్రపడ్డాయి ..కాని ...శంకర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు తనదైన ఇమాజినేషన్ తో సోషల్ థీం కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి ఒక సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు ...

మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ? అని అడిగిందో విలేఖరి ..." యాంటి కరప్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ " అని డెఫినెట్ గా చెప్పాడు శంకర్ ....

అవినీతి ..లంచగొండి తనం మీద అంతపెద్ద సినిమా తీసాక ...అనుకోని వరంలా ఐశ్వర్య రాయ్ శంకర్ ను వెతుక్కుంటూ వచ్చి మీతో సినిమా చేయాలనీ ఉంది అని చెప్పింది .. నిజానికి శంకర్ ప్లాన్ చేసింది ఫ్యామిలి ఎంటర్ టైనర్ .. ఓ మోస్తరు బడ్జెట్ లో తీసేయొచ్చు ...కాని శంకర్ ఎవరెస్ట్ ఎక్కే క్రమం లోనే ఉన్నాడు ..అడుగు కూడా కిందకి దిగే ఆలోచన లేదు జీన్స్ సినిమాలో రెండు డబుల్ రోల్స్ ..విపరీతమైన కంప్యుటర్ గ్రాఫిక్స్ వాడాలి అమెరికాలో పెద్ద షెడ్యూల్ ..అన్నిటికి మించి ఐశ్వర్య రాయ్ అతనికి ఎనిమిదో వింతలా అనిపించింది ..ఏడు వింతలున్న లోకేషన్లకు వెళ్లి వాటిముందు ఐశ్వర్య రాయ్ ని పెట్టి షూట్ చేయాలి ..ఒక్క పాటకోసం ...కోట్లు ఖర్చుపెట్టాడు ...

థింక్... బిగ్ అనుకుంటూ పనిచేస్తాడు శంకర్ ... గ్రో ...బిగ్ అంటూ దీవిస్తారు ..ఆడియెన్స్ ...

జెంటిల్మన్ తర్వాత ప్రేమికుడు ,భారతీయుడు తర్వాత జీన్స్ ఒకేఒక్కడు తర్వాత బాయ్స్...ఇలా ఒకటి సోషల్ థీం ...మరుసటి సినిమా ఎంటర్ టైనర్ ..శంకర్ ..ఒక సర్కిల్ లాంటివాడు ...ఒక్కోసారి ఒక ట్యాంజెంట్ లోకి వెళ్లి జీన్స్ ,బాయ్స్ లాంటి సినిమాలు తీస్తాడు ...వెంటనే మళ్లీ తనదైన సోషల్ థీం కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి ఒక సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు ...39 ఏళ్ళకు డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు ...ఎస్ .పిక్చర్స్ బేనర్ మీద సినిమాలు తీస్తూ ... నవ్యత ఉన్న కథలును సినిమాలుగా తీస్తూ కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు ....

మొదట " ఒకేఒక్కడు " కథ చెప్పినప్పుడు " రజినీకాంత్ " కాదన్నారు ..ఆ సినిమా చేస్తే పొలిటికల్ గా తన మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయన్నారు ..రెండోసారి " అపరిచితుడు " కథతో వెళ్తే ...నెగెటివ్ రోల్స్ చేస్తే .... అబిమానులు ఆదరించరని చెప్పారు ..శంకర్ తగ్గలేదు ... విక్రమ్ ని పిలిచి నువ్వే హీరో అన్నారు .. జుట్టు పెంచు ,కండలు పెంచు అని ఆర్డర్ వేసాడు ..అపరిచితుడు సినిమాలో ప్రతి సీను పండేలా చేసాడు ...ఒకే వ్యక్తిలో మూడు వ్యక్తిత్వాలు ,గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించాడు ... శంకర్ సినిమా పూర్తయ్యేసరికి సుమారు 36 కోట్లు ఖర్చయింది .. రిలీజ్ అయిన తర్వాత 65 కోట్లు పైగా వసూలు చేసింది ...మార్కెట్ ఎకానమి లో ప్రాతీయ సరిహద్దులకే పరిమితమైన రీజినల్ సినిమాని గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టిన వాడు .... " శంకర్ "లెక్క ప్రకారం సోషల్ థీం తో సినిమా అయింది కాబట్టి ఎంటర్ టైనర్ తీయాలి ...కాని ఎ.వి.ఎం .లాంటి ప్రఖ్యాత సంస్థ సినిమా చేయమని " శంకర్ " ని అడిగినపుడు అతను కండిషన్ పెట్టాడు .. " రజినీకాంత్ " ని ఒప్పించండి .. సినిమా చేస్తానన్నాడు ...ఎ.వి.ఎం అడిగితే కండిషన్ నా ? ...నిర్మాతలు రంగం లోకి దిగారు ...ఈసారి రజని ...ఎస్ అన్నారు ... 60 కోట్లు రూపాయల బడ్జెట్ అడిగాడు ...శంకర్ ... దానికి ఎస్ అన్నారు .... నిర్మాతలు శంకర్ చిరకాల స్వప్నం నెరవేరింది ... ఇప్పుడు రజిని ని డైరెక్ట్ చేస్తున్నాడు ...ఏడాదిన్నర పాటు తీరిగ్గా తీసాడు సినిమాని ...రిలీజ్ అయ్యాక " శివాజీ " 125 కోట్లు వసూలు చేసింది ...చైనా ,జపాన్ ,మలేషియా ,సింగపూర్ దేశాల్లో కూడా " శివాజీ " ఒక సంచలనం అయింది శంకర్ మీద ఎంత ఖర్చు చేస్తే అంత రాబడి ఉంటుందని మరోమారు రుజువైంది ...2001 ..నాయక్ ( హిందీ ఒకేఒక్కడు ) అయ్యాక ...కమల్ ,ప్రీతిజింటా జంటగా ... " రోబో " సినిమాని ఎనోన్స్ చేసాడు శంకర్ ...కాని నిర్మాతల వెనకడుగు వలన అది సాద్యం కాలేదు ...2007 లో షారుఖ్ ఖాన్ .. శంకర్ తో రోబో సినిమాని తాను నటిస్తూ ..నిర్మిస్తానని ముందుకొచ్చాడు కాని .. స్క్రిప్ట్ లో షారుఖ్ ఖాన్ .చెప్పిన మార్పులకు శంకర్ ఒప్పుకోలేదు ... ఈ సారి కూడా ... పనవలేదు ...కాని ఆ సబ్జెక్టు మీద నమ్మకం ఇంకా పెరిగింది ....శివాజీ సినిమా అయ్యాక ... ఈ కథని రజిని కి చెప్పాడు శంకర్ ...మారు మాట్లాడకుండా ... ఎప్పుడు ప్రారంభిస్తున్నావ్ అన్నారు రజిని ...జీన్స్ తరవాత అడిగిన ప్రతి సినిమా కాదన్న ఐశ్వర్య రాయ్ ..ఈసారి నో చెప్పాడని ఇష్టపడలేదు ...అందులోనూ రజిని పక్కన అనేసరికి ...వెంటనే డేట్స్ ఇచ్చేసింది .....ముందుగా అనుకున్న నిర్మాతలు ఎరోస్ ఇంటర్నేషనల్ & ayngaran ... 2008 లో వచ్చిన ఫైనాన్సియల్ క్రైసిస్ వలన ... తప్పుకోగా ..సన్ పిక్చర్స్ వాళ్ళు ... 165 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యారు ...ఆక్టోబర్ 1 2010 3000 స్క్రీన్ లు 2250 ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా .. విడుదల అయి ..సంచలన విజయం సాదించింది ... " రోబో "శంకర్ సినిమా ఒక సమోహనాస్త్రం ...సామజిక సమస్యలను .. ప్రతిభావంతంగా చిత్రీకరించడం ,చర్చించడం వాటికి తెలివైన ..ఆమోదయోగ్యమైన పరిష్కారాలు అందించడం అతడి స్టైల్ ...

జనం తమ సమస్యలను మర్చిపోవడానికి సినిమాలకు వస్తారు ...అవే సమస్యలను చాల అందంగా ... ఆలోచించే విధంగా ,అద్భుతంగా రూపొందించడం లోనే " శంకర్ స్టైల్ అఫ్ ఫిలిం మేకింగ్ " దాగుంది ..


"ది మేకింగ్ అఫ్ శంకర్ "
-------------------------
దర్సకత్వ శాఖలో 17 సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసారు శంకర్ పవిత్రన్ దగ్గర " మండే సూర్యుడు " కు కో డైరెక్టర్ గా చేసారు .. అసిస్టెంట్ గా అదే ఆఖరు సినిమా 

శంకర్ కు ప్రత్యేకంగా రైటర్స్ టీం ఉంది , స్టొరీ సిట్టింగ్స్ కి కొట్టాయం ,కన్యాకుమారి ,వైజాగ్ లాంటి చోట్లకు వెళ్తుంటారు ...ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సిట్టింగ్స్ జరుగుతాయి మైయిన్ ఐడియా శంకర్ దే ...ఏమైనా బెటర్ మెంట్స్ చెప్పమంటారు ...10 గంటల తర్వాత ఎవరిష్టం వాళ్ళది ... మళ్లీ సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు సిట్టింగ్స్ జరుగుతాయి ...

పాటల చిత్రీకరణకు అందరూ 5 రోజులు తీసుకుంటే... శంకర్ మాత్రం 10 రోజులు తీసుకుంటారు నటీనటులను స్మూత్ గా హేండిల్ చేస్తారు ... కరెక్టుగా తనకేం కావాలో ఇంజెక్ట్ చేసి చేయించుకుంటారు .... అవసరమైతే తనే యాక్ట్ చేసి చూపిస్తారు ...

ఎ షాట్ అయినా 1 లేదా 2 టెక్స్ లోనే ఓకే చేసేస్తారు ...తీసిందే తీయడం ఆయనకు ఇష్టం ఉండదు సాదారణంగా షూటింగ్స్ లో కేకలు ,అరుపులు అధికం ....వేలమంది వర్క్ చేస్తున్నా ..శంకర్ షూటింగ్ లో హడావిడి ఉండదు ...మేకింగ్ అంతా కార్పోరేట్ స్టైల్ లో ఉంటుంది ....అసిస్టెంట్ కి కూడా మంచి వేతనాలు ఇచ్చే శంకర్ లో హాస్యప్రియత్వం ఎక్కువ ..!

ప్రేమికుడు సమయంలో తెలుగు బాగా నేర్చుకున్నాడు ..ఇప్పుడాయన చాల స్ఫష్టంగా తెలుగు మాట్లాడతాడు ...తెలుగు డబ్బింగ్ జరుగుతున్న దగ్గరికి వచ్చి వర్క్ ఎలా జరుగుతుందో గమనిస్తారు ...ఫలానా పాత్రకు ఫలానా వాయిస్ సూట్ అయిందో లేదో చూస్తారు ...

స్క్రిప్ట్ ఒకసారి పక్కా అయ్యాక మళ్లీ మార్పులు చేర్పులు అంటూ ఉండవు ..భారతీయుడు లో ఒకేఒక్క షాట్ మాత్రం అప్పుడుకప్పుడు మార్చారు ..పచ్చని చిలకలు తోడుంటే ... అనే పాటలో 500 రూపాయల నోట్లతో పడవలు చేసి నీళ్ళలో వదులుతారు కదా .. అది నిర్మాత రత్నం ఆలోచన ..బాగుందని శంకర్ తన ఆలోచన పక్కన పెట్టేసి ఇది వాడారు ....శంకర్ బలం - నగర జీవితం లో ఆణువణువూ తెలియడం ...బలహీనత - పల్లె జీవనం అస్సలు పరిచయం లేకపోవడం శంకర్ పుట్టింది కుంభకోణం అయినా పెరిగింది మాత్రం చెన్నై లో ...

చిన్నతనం నుండి సంగీతం అంటే పిచ్చి ..పెళ్లిళ్లకు పెట్టె కచేరీలకు తరుచు వెళ్తూఉండేవాడు ... ఇంట్లో బకెట్స్ , బిందెలు బోర్ల వేసి డ్రమ్స్ వాయిస్తూ అమ్మతో తిట్లు తినేవారు ... భూతద్దం సహాయం తో రోడ్డు పై దొరికే పాత ఫిలిం లను ఏరుకొచ్చి చూసేవారు ...

ఎస్ .ఎ .చంద్ర శేఖర్ ( హీరో విజయ్ ఫాదర్ ) దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ అడపాదడప వేషాలు వేసారు సీతా అనే సినిమాలో ఫుల్ లేన్త్ కామెడి చేసారు .. అది కాస్త ఫ్లాప్ అవడం తో నటుడు కావాలనే నమ్మకం పోయింది ...శివాజీ లో బల్లెలక్క పాటలో ...అలా చమక్ మని మెరిసారు ..ఒకసారి షూట్ లో ఎవరో ఆర్టిస్ట్ సెట్ లోకి రాలేదని ... కోపం తో క్లాప్ బోర్డ్ శంకర్ మీదకి విసిరారట చంద్రశేఖర్ ..దెబ్బ తగిలి రక్తం వస్తుంటే .. క్లాప్ బోర్డ్ తుడిచే క్లాత్ తో తుడుచుకుంటూ ... ఆ ఆర్టిస్ట్ ని పిలవడానికి వెళ్లారట ..శంకర్ ..

దర్శకుడు గా తీసుకున్న తొలి అడ్వాన్సు తో అమ్మకు జత బంగారు గాజులు , కలర్ టి.వి కొన్నారు .18 ఏళ్ళ వయసులో ఓ టైపు మిషన్ల కంపెనీ లో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేసారు ...నాలుగున్నర ఏళ్ళకు పర్మిట్ చేయటం అనేది ఆ కంపనీ రూల్ ,కాని మూడేళ్లకే ఏదో వంకతో పంపించేస్తారు .ఈ విషయం తెలిసి శంకర్ యాజమాన్యం పై తిరగబడ్డారు ..దాంతో చెన్నై సెంట్రల్ జైలు లో మూడు రోజులు ఉంచారు .

ఇప్పటివరకు భారతీయ సినిమా తయారీదారులు అడుగుపెట్టని స్టూడియో ...." స్టాన్ విన్స్ టన్ యానిమేషన్ స్టూడియో " టెర్మినెటార్ ..జురాసిక్ పార్క్ ..అవతార్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియో లోనే మన భారతదేశం నుంచి మొట్టమొదటి సారిగా " రోబో " యూనిట్ ఈ స్టూడియో లో అడుగు పెట్టింది రోబో చిత్రం క్లయిమాక్స్ లో హీరో రజినీకాంత్ ,హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ,విలన్ రోబో రజినిలు పాల్గొనగా ఓ భారి ఫైట్ ఉంటుంది ... హీరో రజినీకాంత్ తో పోరాడటానికి 100 రోబోట్లు వరసగా వస్తాయి ...ఈ వంద రోబోల సృష్టి కోసం " స్టాన్ విన్స్ టన్ యానిమేషన్ స్టూడియో " లోని యాని మేట్రిక్స్ టెక్నాలజీని ఆశ్రయించారు శంకర్ ....వాళ్ళు ...ఈ క్లయిమాక్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తవ్వడానికి దాదాపు 8 నెలలు పడుతుందన్నారు అందుకని రోబో షూటింగ్ ఆరంభించినప్పుడే క్లయిమాక్స్ ని చిత్రీకరించారు ..శంకర్ ..

సినిమాల ద్వారా ఇచ్చే సందేశాల వలన దేశం లో రాత్రి కి రాత్రి మంచి మార్పులు జరుగుతాయని నేనడంలేదు .. కాని వ్యవస్థలో మార్పు రావాలంటే ... కొన్ని సంవత్సరాలు పడుతుంది ... కాకపోతే తన సినిమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశం ఇవ్వడానికి ....ప్రయత్నిస్తున్న నా అభిమాన దర్శకుడు ... " శంకర్ " అభినందనీయుడు ...!


కొండవీటి నాని

No comments:

Post a Comment