Tuesday, May 22, 2012

పాటసారి


చిన్నప్పుడు జోలపాట ... కాలేజిలో సరదాపాట రచయతగా బతుకుపాట ..ఇలా తన జీవితంలో ఎన్నోపాటలువాటికోసం ఎన్నో పాట్లు ...

స్టేజ్ మీద నేను చేతిలో మైకు ఎదురుగా నాగార్జున ...ఆయన్ని చూడగానే ఏదో గుర్తొచ్చింది ..చెప్పాలనిపించింది ..మొదలుపెట్టాను ...చిన్నప్పుడు ఓ సారి మిమ్మల్ని చూద్దామని షూటింగ్ స్పాట్ కి వచ్చాను సెక్యురిటి వాళ్ళు తోసేసారు ...బురదలో పడ్డాను ..ఇంకోసారి అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట నిలబడ్డాను ..గూర్ఖా పొమ్మన్నాడు ..ఆ రోజే అనుకున్నాను ...ఎప్పటికైనా మీ సినిమాలకి పాటలురాయలని..అది నిజమైంది ...నాగార్జున నన్నే చూస్తున్నారు ...సారి .... భాస్కరభట్ల వాళ్ళకి నీ గురించి తెలిసి ఉండదులే అన్నారు నవ్వుతూ ....అవి నా జీవితం లో చాల ఉద్వేగభరిత క్షణాలు ...నా అభిమాన హీరో కళ్ళముందే ఉండటం ...అతని సినిమాకి పాటలు రాయడం ...ఇవన్ని 'పాట' నా కిచ్చిన బహుమానాలు ...జీవితంలో ప్రతి దశలోనూ ...నేను 'పాట'సారినే !

"విను నా మాట ...విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట "...ఇది మా ప్రసాద్ బాబాయ్ చిన్నప్పుడు నన్నెత్తుకుని పాడినపాట ..ఇప్పటికి గుర్తుంది మా తాతగారు హరికథలు చెప్పేవారు .. అవి కొన్ని గుర్తే ..వీటితో పాటు వంశధార ఒడ్డున ఇసుకలో ఆటలు గుర్తున్నాయి నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోని బూరవిల్లి గ్రామం లో ...నాన్న భాస్కర శర్మ , అమ్మ విజయలక్ష్మి నాలుగోతరగతి వరకు అక్కడే ...ఆపై మేం రాజమండ్రి వెళ్ళిపోయాం ..అప్పటినుంచి గోదావరితో అనుబంధం ...కోటిపల్లి బస్టాండ్ దగ్గరలో మా ఇల్లు ..డీలక్స్ సెంటర్ మీదుగా నడిచేల్తే ...మా స్కూల్ చుట్టూ పే..ద్ద ప్రహరి గోడ ..దానిపై సినిమా పోస్టర్స్ ...ఉదయము సాయంత్రం వాటిని చూస్తూ నిలబడిపోయేవాణ్ణి .పోస్తేర్ల్లలో చాల పేర్లు ...వాటి మద్య వేటూరి ..సిరివెన్నెల ,భువనచంద్ర ... ఇవిమాత్రం చాల ఆకర్షించేవి ... ఎందుకో తెలియదు ... అందుకేనేమో తెలుగు పై మమకారం పెరిగింది కాదు కాదు ..కమలా టీచర్ పెంచింది ...హై స్కూల్ లో ఆవిడ తెలుగు పాఠాలు చెప్పేవారు ...ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి ..మరోపక్క మా తాతగారు ..వేమన పద్యాలూ సుమతి శతకం నేర్పించేవారు .. 

ఏడో తరగతిలో ఒక కవిత రాసాను ..అదీ మా స్కూల్ బ్లాకు బోర్డు మీద ...అది మా టీచర్ కి బాగా నచ్చేసింది ..ఓ పెన్ను ,పెన్సిల్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ..దానితో 'మనం కవి అయిపోయాము 'అనే ఫీలింగ్ .....రాయడం మొదలపెట్టాను ..అప్పట్లో రాజమండ్రి లో " సమాచారం,కోస్తా వాణి,గౌతమీ టైమ్స్ 'లాంటి స్థానిక పత్రికలు ఉండేవి కొన్ని కవితలు రాసుకుని వాటి ఆఫీసులకి వెళ్లి బాక్స్ లో పడేసి వచ్చేసేవాడిని .. మర్నాడు ఆశగా పత్రికలు చూసేవాడిని ..కాని ఏ ఒక్కటి ప్రచురణ అయ్యేదికాదు ..అయినా సరే రోజు అ బాక్స్లలో కవర్లు వేస్తూ ఉండేవాడిని ..ఓ రోజు ...గౌతమీ టైమ్స్ ఆఫీసు లో కవరు ఇస్తుంటే ఓ పెద్దాయన చూసారు 'ఏంటిది ' అని అడిగారు ..కవిత సార్ అన్నాను ...నువ్విచ్చిన కవితలు బోలెడు ఉన్నాయి లోపల వాటిని ఏం చేయాలో తెలియడంలేదు ...అయినా ..ఇది కవిత్వం కాదు ..అన్నారు లేదు ..లేదు ..ఇదే .. చూడండి ..లైను కింద లైను ..ఉంది ..ఇలాగే కవిత్వం రాస్తారు అన్నాను .అయన నవ్వుకుని ' నీకు శ్రీ శ్రీ తెలుసా ' అని అడిగారు ..అడ్డం గా తలూపా..శ్రీ శ్రీ ఎవరో తెలియకుండా ..కవిత్వం రాస్తావా ..? అన్నారు ..అప్పుడు మొదలయింది ..శ్రీ శ్రీ ..అన్వేషణ ..!

" నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను ....."

మహాప్రస్థానం మొత్తం కంఠాతా వొచ్చేసింది ... శ్రీ శ్రీ కి వీరాభిమానిని అయిపోయాను ..పుస్తకాల పురుగునయిపోయాను .. అప్పుడు నేను టెన్త్ క్లాసు ..ఇదే హాబి ఇంటర్ల్లోను కొనసాగింది ..రోజులు గడుతుస్తున్నాయి .. కవర్ల్లకి స్టాంపులు అతికించి కవితలు పంపుతున్నాను ..పత్రికల్లో వస్తు ఉన్నాయి ...కొన్నాళ్ళకి ఎంతకాలం స్టాంపులకి,షేవింగ్ క్రీములకి డబ్బులిమ్మని ఇంట్లో అడగటం ?నా రచనలతోనే ఎంతో కొంత సంపాదించాలి అనుకున్నాను .ఎలాగైనా పాటల రచయిత కావాలన్న కోరిక నెమ్మిదిగా బలపడింది .. ఎంతగా అంటే...నేను చనిపోతే పత్రికల్లో ..." గేయ రచయత భాస్కరభట్ల కన్నుమూత " అని వార్త రావాలన్నంత ..!

బోటని పాఠాముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లేక్చరుంది మిస్టరి పిక్చరుంది సోదరా ఏది బెస్టు రా ....

కాలేజి రోజుల్లో ఈ పాట అంటే పిచ్చి ..! శివ చూసాక .నాగార్జున ,సిరివెన్నెల ,రామ్ గోపాల్ వర్మ ..లకు పెద్ద ఫ్యాన్ అయిపోయా..!హైదరాబాద్ వెళ్లి ..నాగార్జున సినిమాలకు పాటలు రాసేద్దామనిపించింది ...ఆపనే చేశా ..మా నాన్నగారి పాత ప్యాంటు సైజు చేయించుకుని .. కాళ్ళకి హవాయి చెప్పులేసుకుని అన్నపూర్ణ స్టూడియో గేటు ముందుకు వచ్చి అటు ఇటు తిరుగుతుంటే ..ఎవరో ఒకరు పిలిచి పాట రాయమని అడగక పోతారా అన్నా ధీమా ..!ఏయ్ ..బాబు ..అంటూ ఎవరో పిలిచారు ... చూస్తే.. వాచ్ మన్ ' ఇక్కడ ఉండొద్దు ' వెళ్ళిపో అన్నాడు ..ఎం చేస్తాం ..డొక్కు ప్యాంటు చెప్పులు అదోలా ఉంది ..మన అవతారం ..తిరిగి రాజమండ్రి వచ్చేసి ... మా నాన్నగారి స్నేహితుడి ద్వారా ' ఈనాడు ' లో విలేఖరి గా చేరాను ..ఓ పక్క కాలేజిలో చదువుకుంటూనే .కవి సమ్మేళనాలు ,సాహిత్యసభల వార్తలు రాస్తూ ఉండేవాణ్ణిరాజమండ్రి లో జరిగే షూటింగుల వార్తలు ' సితార 'కి రాస్తుండేవాడిని.. ఆ తర్వాత సితార రిపోర్టరుగా హైదరాబాద్ కి వచ్చా ...రిపోర్టరు ఉద్యోగం ..ఆపై పెళ్లి .. జీవితం గాడిలో పడింది కాని ..లక్ష్యం దారి తప్పింది ...ఏడేళ్ళు గడిచిపోయాయి ... పాట రాయాలన్న కోరిక ఏమైపోయింది ..నా లక్ష్యమేంటి ..నా ప్రయాణం ఎటువైపు సాగుతుంది ... అని ఓ సారి ఆత్మావలోకనం చేసుకున్నా ...ఉద్యోగం మానేద్దామనుకున్నా...ప్రయత్నాలు మొదలుపెట్టాను .. చాల మంది దర్శకులు చూద్దాం చేద్దాం అంటూ దాటేసేవారు ... చివరికి ఈ.వి.వి గారు 'చాల బాగుంది ' సినిమాకి ఓ పాట రాసే అవకాశం ఇచ్చారు ..ట్యూన్ ఇచ్చి రాయమన్నారు ... ఆ పాట ఓకే కాలేదు ..!తర్వాత 'గొప్పింటి అల్లుడు' లో ఓ పాట రాసాను ... తొలిసారి తెరమీద పేరు చూసుకుని మురిసిపోయాను .. కాని ఎక్కడో అసంతృప్తి .సినిమా బాగా ఆడలేదు .. ఆపై వరస ప్లాపులు ... నాకు సక్సెస్ కావాలి హిట్ సినిమాలకు రాశానన్న తృప్తి మిగలాలి ..దానికోసం పోరాటం సాగించాను ...

చినుకులన్ని కలసి చిత్ర కావేరి చివరికా కావేరి కడలి దేవేరి కడలిలో వెతకొద్దు కావేరి నీరు కడుపునిండా వెతకొద్దీ కన్నీరు కారు ఎండమావుల మీద ఎందుకా బెంగ గుండెలో దాగుంది గుట్టుగా గంగ 

ఇది శుభసంకల్పం లో వేటూరి గారు రాసింది ..ఈ పాట విన్నప్పుడల్లా ఉద్యోగం మానేసిననాటి రోజులు గుర్తొస్తాయి ..పాటలో వేటలో ఉద్యోగం మానేసా .. అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి .. అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.. చేతిలో డబ్బులుండేవి కావు .. పగలంతా పాటల పాట్లు .. రాత్రయ్యేసరికి నేను మా ఆవిడా కూర్చుని వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవాళ్ళం ..వాళ్ళిచ్చిన పారితోషికం తో రోజులు నేట్టుకోచ్చేవాళ్ళం ..అలాగని ఉద్యోగం మానేసి తప్పు చేశానని ఎప్పుడు నిరుత్సాహపడలేదు ..జీవితం ..చిన్నది ..కష్టాలు మరీ చిన్నవి ..కాబట్టి వాటిని వీలైంత త్వరగా అనుభవిస్తేనే తర్వాత సక్సెస్ వస్తుందని అనుకునేవాణ్ణి..అలాంటి ఓ రోజు రానే వచ్చింది .....

నా ధమనుల్లో సిరల్లో రక్తం కాదు ప్రవహిస్తుంది .. గోదావరి నీళ్ళు ..నా దేహం దేహమంతా గోదావరితో నిండిపోయింది ..నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు వాడిపోని పారిజాతమే ..ఇరిగిపోని గంధమే ..రాజమండ్రి వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కుతాను అందులో వెళ్తూ రాజమండ్రి చేరుకుంటుంటే నన్నెవరో అనాథ శరణాలయం నుంచి అమ్మ పొత్తిళ్ళలోకి చేరవేస్తున్నట్లు అనిపిస్తుంది ..డబ్బా పాలు విసిరేసి అమ్మ స్తన్యాన్ని గ్రోలడానికి ఆవురావురుమని వచ్చే పసిపిల్లాన్నైపోతాను ...

ఓ ఉగాది నాడు 'తనికెళ్ళ భరణి 'గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనం లో నేను వినిపించిన కవిత భరణి గారికి బాగా నచ్చేసింది .. ఆ పక్కనే సంగీత దర్శకుడు చక్రి ఉన్నారు ...చక్రి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ...నా దగ్గరకు వచ్చి ..."నేను రాజమండ్రి లో పుట్టి పెరిగి ఉండకపోవచ్చు ..కాని మీ కవిత నా హృదయాన్ని మీటింది మిమ్మల్ని రైటర్ గా పరిచయం చేస్తా .." అన్నారు అప్పటికే కొన్ని సినిమాలకు రాశానని,అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పాను ..అయినా అయన నన్ను పూరిజగన్నాథ్ కి పరిచయం చేసారు ..వాళ్ళిద్దరి కాంబినేషన్ లో నాకో అవకాశం ఇచ్చారు .. అదే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ..అందులో 'రామసక్కని బంగారు బొమ్మ ' రాసాను ..అది హిట్ తరువాత ఇడియట్ ,అమ్మానాన్న తమిళమ్మాయి వరస హిట్స్ శివమణి లో 'ఏనాటికి మన మోకటేనని ' ... జల్సాలో గాల్లో తెలినట్లుందే ..పోకిరిలో ఇప్పటికింకా నా వయసు ...బంపర్ ఆఫర్ ...నచ్చావులే అన్ని పాటలు . ఇలా ఎన్నో హిట్స్ నా కెరీర్ లో నచ్చావులే ప్రత్యేకమైనది ...సితార లో రిపోర్టరుగా ఉన్నప్పుడు ఎప్పుడో మీటింగుల్లో రామోజీ రావు గారిని చూసేవాణ్ణిఆయనంటే చాల గౌరవం నాకు ...'నచ్చావులే ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాడు అయన పక్కనే నిలబడ్డ ఆ "క్షణం" మరచిపోలేనిది 

వీడు చదువు వదిలేసి సాహిత్యం అంటున్నాడు ...కవిత్వమే జీవితం అంటున్నాడు ... అని చిన్నప్పుడు నాన్న నా గురించి టెన్షన్ పడేవారు కాని ..నాకు భవిష్యత్తు స్పష్టం గానే ఉంది ...ఏపనిలో నైన మొదట్లో వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగి పోకూడదు అది మన ప్రయత్న లోపం గా భావించాలి ..సరిదిద్దుకోవాలి ..సాగిపోవాలి ...అప్పుడే విజయం 

నా అభిమాన సిని గేయరచయత " భాస్కర భట్ల రవికుమార్ "
.----------------------------------******--------------------------------------------------------
(ఈనాడు నుంచి )

కొండవీటి నాని

No comments:

Post a Comment