Tuesday, May 22, 2012

RACHA- my opinion




  
" మెగా అభిమానులని రంజింప చేయడానికి రామ్ చరణ తేజ సంపత్ నంది కలిసి చేసిన " రచ్చ "


2012 లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలు ప్రయోగాత్మకమయినవే .. గత కొంత కాలంగా మూసగా సాగుతున్న తెలుగు సినిమా ని కొన్ని చిత్రాలు కొత్త పుంత తోక్కించేవే .

రామ్ చరణ్ తన మొదటి సినిమా నుండి కమర్షియల్ విలువలను కాపాడుకుంటూ ఎంతో కొంత కోతదనం ఉన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకున్నారు , కానీ నా ద్రుష్టి లో రామ్ చరణ్ మొట్టమొదటి పూర్తి గా ఒక మాస్ చిత్రం మాత్రం " రచ్చ " నే .. సినిమా కథను తీసుకుంటే మనకు " అల్లు అర్జున్" చేసిన " బన్నీ " గుర్తుకువస్తుంది .. CLIMAX FIGHT చూస్తే మొన్ననే వచ్చిన " పూలరంగడు " క్లైమాక్స్ సన్నివేసం గుర్తుకు వస్తుంది .. కొన్ని రోజుల క్రితం వరకు కొన్ని సినిమాలు మాస్ మూసలో పడి " పాట ఎందుకు వస్తుందో , కామెడీ సీన్ ఏంటో అర్థమయ్యే లోపే సీన్ మారిపోయేది" .. సరిగ్గా దర్శకుడు " సంపత్ నంది " కూడా ఇదే మూస కథని ఎక్కువ ఖర్చు తో చరణ్ తో ప్లాన్ చేసారు .. చరణ్ లాంటి స్టార్ కాబట్టి సినిమాకి మొదటి వారం వసూల్లకి ఎటువంటి అనుమానం లేదు .. " ఆరెంజ్ " లాంటి ప్రయోగాత్మకమైన చిత్రం తరువాత ఈ " మెగా వారసుడు కేవలం అభిమానులకోసం చేసిన సినిమా గా " రాచ ని గుర్తించవచ్చు ..
నాకు ఉన్న సినిమా పరిజ్ఞానం మేర ఇందులో కామెర వర్క్ చేడిందో లేక ఎడిటింగ్ శాఖ పని అటకేక్కిందో కానీ సన్నివేశాల మధ్య కొంత అయోమయం తప్పకుండా ఉంది ..సినిమా లో ఉన్న వస్త్ర ధారణ ( costumes ) బాగుంది కానీ , ఇంకా బాగుండిన్దచ్చు అని అని నా అభిప్రాయం ( వాన వాన పాట లో చాల బాగున్నాయి ) [వాన వాన వెల్లువాయే రేమిక్స్ సినిమా కి మరో ప్లస్ ..]

సినిమా లోని మంచి పాటలు ఉన్నాయి ,తమన్నా , చరణ్ మంచి డాన్సులు ఉన్నాయి . మంచి సెట్స్ ఉన్నాయి , తమన్నా అందాలూ , రామ్ చరణ్ సాహసాలు , సినిమాని మొత్తం నింపేసే విలన్లు, హీరో కి ఫ్లాష్ బ్యాక్ చేప్పే మంచి వాళ్ళు . .. అభిమానులకి కావాల్సిన పోరాట సన్నివేశాలు ఉన్నాయి . కానీ కామెడీ ఎప్పటిదో outdated గా అనిపించింది , ఈ మధ్య సినిమాలు స్టార్ హీరో ల తో సంబంధం లేకుండా కామెడీ సన్నివేశాల వాళ్ళ ఆడిన సందర్భాలు అనేకం , ఇదొక్కటి మినహాయిస్తే ---- ఇది మొత్తంగా మెగా అభిమానులని ఉద్దేశం లో ఉంచుకొని చిత్రీకరించిన సినిమా ..


by
mkK

No comments:

Post a Comment