Tuesday, May 22, 2012

ఈ సినిమా చేయడం అంత వీజీ కాదు




సిలోన్ సుబ్బారావు తెలుసు కదా ..!
అలాగే ..పట్టు పద్మిని గుర్తుంది  కదూ ..!
ఇక గోపాలం ..యెల్ల  పాపారావు .... 
ఆకుల అనంతలక్ష్మీ ..
పెనుగొండ అబ్బులు ...
వీరందరిని ఎలా మరచిపోగలం చెప్పండి ...!

" శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ " సినిమా ను గుర్తుచేసుకోగానే ... 
ఒకరి వెంట ఒకరు తెరలు చించుకుని మరీ మన మనసులోంచి బైటికొచ్చేస్తారు...! 
పాత్రలతో సహా సినిమాని గుర్తుపెట్టుకోవడమంటే ...అంత వీజీ కాదు ...
అలాగే ఈ నేపద్యంలో సినిమా తీయడం అంటే వీజీ కాదు ....
ఏదో " ఫ్రెండ్ షిప్ "  కొద్ది చెప్పాలంటే ..... ఇదంతా ... " వంశీ " ఆడిన స్క్రీన్ ప్లే ..!



ఏయ్ ..శివాజీ !
నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానోయ్..! అన్నారు వంశీ ...
ట్రాన్స్ ఫార్మర్  లో తల పెట్టినంత గా షాక్ అయ్యాడు ..శివాజీరాజా..!

అది  'మహర్షి ' సినిమా షూటింగ్ స్పాట్ ... అందులో హీరో రాఘవ కు స్నేహితుడు పాత్ర చేస్తున్నాడు శివాజీరాజా ... 
సగం పైగా షూటింగ్ అయ్యాక " ఓ మిట్టమధ్యానం " వేళ వంశీ కి శివాజీరాజా లో " హీరో " లక్షణాలు కనపడ్డాయి ..అప్పుడే డిసైడ్ అయిపోయాడు ..అతన్ని పెట్టి సినిమా చేయాలని..!
ఓ పక్క మహర్షి షూటింగ్ జరుగుతుండగానే తర్వాతి సినిమా కోసం కథ మొదలెట్టేసారు వంశీ.ఆయనకు చిన్నప్పుడు నుంచి రికార్డింగ్ డాన్సు లంటే చాల ఇష్టం .
ఆ నేపధ్యం లో  సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది ...
ఎందుకంటే ...
అ తరహ సినిమా అప్పటివరకు ఎవరు చేయలేదు ... 
తనికెళ్ళ భరణి,వేమూరి సత్యనారాయణ లతో కలసి కథను వండటం మొదలపెట్టారు ...
రికార్డింగ్ డాన్సులు ఆడే అమ్మాయి,అబ్బాయి ప్రేమించుకుంటారు ...పెద్దలకు తెలియకుండా గాంధర్వ వివాహం చేసుకుంటారు ...
ఇలా ఓ అందమైన ప్రేమకథగా స్క్రిప్ట్ తయారు చేశారు.భరణి డైలాగులు రాశారు..
ఈ కథకు " శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ - రాజమడ్రి " అని టైటిల్ పెట్టారు ..." వంశీ "

నెల్లూరుకి  చెందిన ఇద్దరు డాక్టర్లు  విజయకుమార్ రెడ్డి ,రమేష్ రెడ్డి సినిమా తీస్తామంటూ వంశీని కలిసారు ..

" సరే ... కొత్త హీరో తో రికార్డింగ్ డాన్సుల నేపధ్యం లో  సినిమా చేద్దామా ..? అని అడిగారు .. వంశీ "

" మీ ఇష్టం ..అయితే మాకు ప్రొడక్షన్ గట్రా తెలియవు ..మీరే చూసుకోండి " అన్నారు డాక్టర్లు .." 

"అది నా వల్ల కూడా కాదు .. 

నిర్మాత స్రవంతి రవికిషోర్ నాకు మంచి స్నేహితుడు ఆయనకు అప్పజేబుదాంలె ,బాగా చూసుకుంటాడు .." అని భరోసా ఇచ్చారు ..వంశీ 

శిక్షణ కోసం శివాజీరాజా ను వైజాగ్ తీసుకెళ్ళారు ... 

హీరో కృష్ణ లాగ క్రాఫ్ చేయించారు ...

హీరోయిన్ గా భానుప్రియ చెల్లెలు నిశాంత (శాంతిప్రియ )ను తీసుకోవాలనుకున్నారు.



ఈలోగా " మహర్షి " సినిమా విడుదలై .. ఫెయిలైంది ... 

" ఏవండి మీకు కొత్త హీరోలు తో అచ్చి రాదేమో ..హీరోగా  రాజేంద్ర ప్రసాద్ ను తీసుకుందాం " అన్నారు నిర్మాతలు 

వంశీ ...ఏం మాట్లాడలేకపోయారు .

రాజేంద్రప్రసాద్ ,నిశాంత పై పోటో షూట్ చేసారు ,కథ కూడా మార్చేసారు..సీరియస్ సన్నివేశాలు తీసివేసి మొత్తం కామెడీతో నింపేసారు.

ఇళయరాజా ఆద్వర్యంలో ఐదుపాటలూ రెడీ అయిపోయాయి ...

షూటింగ్ మొదలపెట్టకముందే సరదాగా ఆడియో రిలీజ్ చేసేద్దాం ..అన్నారు వంశీ ..

అలా రాజేంద్రప్రసాద్ నిశాంత ఫోటోలతో ఆడియో మార్కెట్ లో విడుదలైంది ..!



ఇక్కడే కథ మరోసారి అడ్డం  తిరిగింది  ..ఆఖరి నిమషంలో హీరో హీరోయిన్ లు మారిపోయారు ...

నరేష్ ,మాధురి సీన్ లోకి వచ్చారు ... 

రికార్డింగ్ డాన్సుల్లో జూ"ఎన్టిఆర్ ,జూ'ఎన్నార్ &జూ"చిరంజీవి గా తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన వార్ని ఎంపిక చేసారు ...

మిగిలిన పాత్రలకు కోట శ్రీనివాసరావు ,తనికెళ్ళ భరణి ,రాళ్ళపల్లి ,వై.విజయ తదితరులు సిద్దమయ్యారు .



యూనిట్ అంతా రాజోలులో బస చేసారు ,ఆ చుట్టూ పక్కల ఊళ్లు శివకోడు ,మలికిపురం ,మోరి ,అంతర్వేది ,మానేపల్లి లో చిత్రీకరణ జరిపారు ...

షూటింగ్ దశలో ఏవేవో కొత్త ఆలోచనలు రావడంతో అప్పటికప్పుడు సంభాషణలు రాసి చిత్రీకరింప చేసారు  వంశీ .

ముందు రాసిన స్క్రిప్ట్టుకన్నా ,లొకేషన్ లో చేసిన మార్పులే ఎక్కువ ...

రికార్డింగ్ డాన్సు పాటలన్నీ ఆరు కెమెరాలతో తీసారు ...ఒక్కో కెమెరామన్ తో  ఒక్కోరకంగా షాట్ తీయమని చెప్పారు ...!

యూనిట్ లో వాళ్ళంతా ఇదేదో  కొత్తగా ఉందే అనుకున్నారు ..



కేవలం 22 రోజుల్లో   సినిమా పూర్తయి పొయింది ..

ఎందుకో టైటిల్ బాగా పెద్దదవుతుందని ,ఆఖరి నిమషంలో  " రాజమండ్రి " తీసేశారు .

1988 జూన్ నెలలో " శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ " విడుదలైంది.

ఎనభైలలో ఆంద్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా కోస్తా జిల్లాలను ఊపేసిన రికార్డింగ్ డాన్సుల సంస్కృతి ని నేపద్యంగా తీసుకుని వంశీ చేసిన ఈ సినిమా ...

హాస్య చిత్రాలను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ పెట్టింది ..

నిజానికి ..ఇలాంటి కథ తో సినిమా చేయడం సాహసమే ....

చివరి 20 నిమషాలు మినహాయిస్తే , " నవ్వకుండా ఈ సినిమా చూడటం అసాధ్యం ..!"

పూర్తి గా  డైలాగ్ కామెడి మీదే ఆధార పడ్డారు ... ప్రతి మాట తూటాలా పేలుతుంది ..



ఇందులో ప్రతి పాత్రకు దాదాపుగా ఊత పదాలు ఉంటాయి ...

" ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెపుతున్నాను " అంటూ మల్లిఖార్జున రావు 
" సీతతో అంత వీజీ కాదు " అంటూ తనికెళ్ళ భరణి 
"దొరబాబు ఉక్కేట్టవా ..!"అంటూ సంధ్య చెప్పే ... ఊతపదాలు ..కావలసినంత వినోదాన్ని పంచిపడతాయి ...

" ఇళయరాజా " పాత పాటల రీమిక్సు లు చేయడం ఎప్పుడు వినలేదు కదా ...ఆ ఏకైక అవకాశం ఈ సినిమా కలిగించింది ...
గూడచారి 116 లోని " నువ్వు నా ముందుంటే " 
మనుషులు మమంతలు లోని " సిగ్గేస్తుందా ..?" 
రాముడు భీముడు లోని " తెలిసిందిలే ....  
  
తెలిసిందిలే .... "


ఇలా వంశీ తన కిష్టమైన పాటల్ని చాల ముచ్చటగా రీమిక్స్ చేయించుకున్నారు ...


మాములుగా అయితే రీమిక్స్ కి " ఇళయరాజా " ఒప్పుకునేవారు కాదు ...


కథానుగుణంగా ఇక్కడ రీమిక్స్ అవసరం కాబట్టి చేయాల్సివచ్చింది ... 


ఈ సినిమా పాటల పని జరుగుతున్నప్పుడే " ఇళయరాజా " స్వాతిముత్యం రీరికార్డింగ్ చేస్తున్నారు ...


అందులో చక్రవాక రాగం లో  చేసిన ఓ థీం మ్యూజిక్ ..వంశీ కి విపరీతంగా నచ్చేసింది ... 


ఇళయరాజా ను బతిమిలాడుకుని ఆ థీం మ్యూజిక్ తో  " ఏనాడు విడిపోని ముడివెసేనో " పాట బాణీ కట్టించారు ...


( నాకు చాల చాల ఇష్టమైన సాంగ్ ఇది ..ఈ మధ్యనే నా  ఫ్రెండ్ చెల్లెలు పెళ్లి వీడియో ఎడిట్ కి ఈ సాంగ్ తో స్పెషల్ గా  ఎడిట్ చేసాను )

అలాగే  " ఆలాపన " లోని థీం మ్యూజిక్ తో " కలలా ..కరగాలా " పాట చేయించుకున్నారు ...!

పాటల్లో ,మాటల్లో ,తీతల్లో ...వంశీ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ..!
హరిఅనుమోలు కెమెరా కన్ను ఆ రికార్డింగ్ డాన్సు లని అద్భుతంగా తెరకెక్కించారు ..!
గోపాలం గా నరేష్ చలాకీగా కనిపిస్తారు ...సీతగా మాధురి ఎంపిక ఆ పాత్రకు కరెక్టే అనిపిస్తుంది ...!
ఇందులో అన్ని లైవ్ల్లి కేరేక్తర్సే ..ఒకరిని మించి ఒకరు బోలెడంత అల్లరి చేశారు ...!

కమలహాసన్ ఈ సినిమా టైటిల్ గురించి తెలుసుకుని తెగ ముచ్చట పడిపోయారు ...
ఎప్పుడో వంశీ ని  కలసినప్పుడు ఈ టైటిల్ గుర్తుచేసి  " భలే పెట్టారండి టైటిల్ " అని మెచ్చుకున్నారు ..!

" పెనుగొండ " (పశ్చిమ గోదావరి జిల్లా )నుంచి పాముల నాగేశ్వర రావు అనే అయన ట్రూప్ తో సహా వచ్చి మా ఊళ్ళో రికార్డింగ్ డాన్సు లాడారు ...
 అదే నేను మొదటిసారి చూడ్డం ..బాగా నచ్చేసింది ... ఆ నేపద్యంలో సినిమా తీయాలని అప్పుడే అనుకున్నా ..
 మొదట సీరియస్ గా తీయాలనుకుని ,తర్వాత కామెడి చేశాం ...! 
 ప్రేమకథను కామెడి డామినేట్ చేసేసింది ... 
 ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని నటుడు ప్రదీప్ శక్తి అడుగుతున్నారు ... 
అమెరికా లోని తాన సభలకు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన తో కథ చేద్దామనుకుంటున్నా! "
( వంశీ ..దర్శకుడు )

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ..సందర్భంగా ....
మన " తెలుగు సినిమా పిచ్చోళ్ళు " కోసం ...!




కొండవీటి నాని

No comments:

Post a Comment