Tuesday, May 22, 2012

న్యూ జనరేషన్ కి ... " నువ్వే ..నువ్వే "



కొంతమంది మాటలకు ముత్యాలు రాలతాయి అంటారు . కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు బాక్సాఫీస్ దగ్గర వజ్రాలే రాలతాయి ..చిలిపితనం ..తెలుగుతనం, మమకారం, వెటకారం, ...ఇంకా చెప్పాలంటే ... సూరేకారం నింపి టపాసులా పేల్చాడు "అతడు "ఏడెనిమిది సినిమాలకే మాటలు రాసి" నువ్వు నాకు నచ్చావ్ " ..పదికాలాలపాటు తెలుగు చిత్ర సీమకు "నువ్వేకావాలి "అనిపించుకున్నారు ..నేను మాటలు రాస్తాను కానీ ... మాట్లాడను అని చమత్కారంగా మాట్లాడే త్రివిక్రమ్ జీవితం లో ఎన్నో మలుపులున్నాయి .
త్రివిక్రమ్ అసలు పేరేంటో తెలుసా ?ఆకెళ్ళ శ్రీనివాస్ ...ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ' శ్రీనివాస్ ' అని పెడదామని నాన్న...'త్రివిక్రమ్' పేరు బాగుంటుందని పెదనాన్న వాడులాడుకున్నారట ....చివరకు నాన్న పంతమే నెగ్గింది ..అయితే సినిమాల్లోకి వచ్చాక తన కలం పేరు ' త్రివిక్రమ్ ' అని మార్చుకుని పెదనాన్న కోరిక నెరవేర్చారు ...

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన త్రివిక్రమ్ డి.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ , వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లో ఎం.ఎస్.సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివారు ...కాలేజి రోజుల నుండే రోజు సెకండ్ షో చూడటం అలవాటు ..త్రివిక్రమ్ ఏనాడు సినిమా రంగానికి వెళ్తానని ఎవరి దగ్గర చెప్పలేదు అయితే అయన మనసులో దర్శకుడు కావాలనే అభిలాష ఉంది ...అందుకే 1996 లో హైదరాబాద్ చేరుకున్నారు ఇంట్లో మాత్రం ఉద్యోగం ప్రయత్నం కోసమని చెప్పారు .లకడికాపూల్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని జీవనోపాధికోసం హోం ట్యూషన్స్ చెపుతూ నెలకు 1500 సంపాదించేవారు అప్పుడు అయన రూమ్మేట్ సునీల్ .

ఓ రోజు రాత్రి మాసాబ్ ట్యాంక్ వైపు పచార్లు చేస్తుంటే హాస్య నటుడు గౌతమ్ రాజు తారసపడ్డారు ,పరిచయం పెరిగింది పద్మాలయ టెలి ఫిలిమ్స్ వారి ' మూవీ టౌన్ ' అనే సినిమా ఆధారిత కార్యక్రమానికి స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది, అది ఓ టి.వి.లో ప్రసారమైంది .

' రోడ్డు ' పేరుతో ఓ కథ రాసి ,నవలా రచయత కొమ్మనాపల్లి గణపతి రావు ను కలిసారు ..అయన కథ చదివి చాల బాగా రాసావ్ అని మెచ్చుకుని అప్పటికప్పుడు ఓ వార పత్రికకు ఆ కథ పంపించారు . అ కథ ప్రచురితమైనది కూడా ..కొమ్మనాపల్లి ద్వారా 'మెరుపు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు ,అయితే నో శాలరీ ,అయినా రొజూ పరవాలేదని నాలుగు గంటల వరకు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత ఇంటికి వెళ్లి ట్యూషన్స్ చెప్పేవారు .

గౌతంరాజు ద్వారా నిర్మాత టి.వి.డి ప్రసాద్ పరిచయమయ్యారు ..అప్పుడాయన ' అక్క బాగున్నావా ' సినిమా తీస్తున్నారు .. దానికి సరదాగా క్లైమాక్స్ రాసి తీసుకురమ్మన్నారు,తర్వాత రచయత పోసాని కృష్ణమురళి ని కలవమని చెప్పారాయన .

ఫోన్ చేయగా చేయగా ఎప్పుడో దొరికారు పోసాని ,చెన్నై రమ్మన్నారు 'ముద్దులమొగుడు' స్క్రిప్ట్ యిచ్చి డైలాగ్స్ రాయమన్నారు ..అప్పటికి త్రివిక్రమ్ కి డైలాగ్స్ ఎలా రాయాలో తెలియదు .పోసాని స్నానానికి వేల్లోచ్చే లోపు ఆ టేబుల్ పైన ఉన్న ఫైల్లో డైలాగ్స్ చూసి ఎలా రాయాలో అవగాహన ఏర్పరుచుకున్నారు.

1996 జులై నుంచి 21 నెలలు పోసాని దగ్గరే పనిచేసారు త్రివిక్రమ్ .పవిత్రబందం నుంచి శివయ్య వరకు అయన సహాయకుడిగా పనిచేసారు .

కృష్ణ వంశీ 'సముద్రం'సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు .వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నారుశ్రీహరి, తనికెళ్ళ భరణి పై తీసే సన్నివేశానికి అర్జెంటుగా సంభాషణలు మార్చవలసివచ్చింది .సమయానికి మాటల రచయత శోభన్ అందుబాటులో లేరు,అప్పుడు అక్కడే ఉన్న త్రివిక్రమ్ ఆ సంభాషణలు రాసి యిచ్చారు .

వేణు , శ్యాంప్రసాద్ ఇంకొంతమంది స్నేహితులు ఉండేవారు ,సోమాజిగూడ లోని ఓ టీ స్టాల్ లో తరుచు కలుస్తూఉండేవారు .వాళ్ళ సంభాషణంతా సినిమాల గురించే .ఈ మిత్రబృందమంతా కలసి ' స్వయంవరం ' సినిమా మొదలెట్టారు కథ,మాటలు 'త్రివిక్రమ్ ' సినిమా విడుదలై హిట్టయింది .. అందరికన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పేరొచ్చింది ..ఎవరీ కుర్రాడు అంటూ ఆరాలు మొదలయ్యాయి .నాలుగైదు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి .కానీ త్రివిక్రమ్ ఎవరికి చెప్పకుండా ఎంచక్కా భీమవరం వెళ్ళిపోయారు ...మూడు నెలలు అక్కడే ఉండి కాలక్షేపం చేసోచ్చారు .. ఆ తర్వాత " నువ్వేకావాలి " మొదలైంది ..దానికి ఆధారం ' నిరమ్ " అనే మలయాళ సినిమా ... దాన్ని యధాతదంగా అనుసరించేయొచ్చు ... అలా చేసుంటే త్రివిక్రమ్ ఎందుకయ్యేవాడు ...రోజుకో వెర్షన్ రాసి చింపిపారేసేవాడు .. ఇంకా ఏదో కొత్తగా కావాలనిపించేది ..అలా తనకు నచ్చే వరకూ రాస్తూనే ఉన్నాడు ...అందుకే 'నువ్వేకావాలి ' సినిమా విడుదల అయ్యాక చాల మంది దర్శక నిర్మాతలు ' నువ్వేకావాలి "అని వెంటపడ్డారు 

సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అన్నగారికి అల్లుడు కూడా అయిన త్రివిక్రమ్ కు పాటలు రాయడం కూడా వచ్చు ' ఒక రాజు ఒక రాణి ' లో అన్ని పాటలు ఆయనే రాశారుభవిష్యత్తు లో సాహిత్య గ్రంధం రాయాలనేది అయన కోరిక .నువ్వే నువ్వే తో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ దాని సంగీత దర్శకుడు కోటితో కలసి పాట పాడారు .. అత్యవసర పరిస్థితుల్లో కోరస్ సింగర్స్ లేక ఆ పాటలో గొంతు కలిపారు ...ఆతర్వాత అతడు ,జల్సా ,ఖలేజా చిత్రాలను డైరెక్ట్ చేసారు ...

రచయతగా ఒక ప్రత్యెక శైలిని చూపిన్చినట్లుగానే ,దర్శకుడి గాను తనకంటూ ఓ బాణీ ని అలవరచుకున్నారు 

తీసేది వాణిజ్య చిత్రమైన అందులో తప్పనిసరిగా వినోదం ఉండాలనేది అయన సిద్దాంతం .

ప్రస్తుతం అయన ...అల్లు అర్జున్ ఇలియానా జంటగా సినిమాని తెరకెక్కిస్తున్నారు ...



కొండవీటి నాని

No comments:

Post a Comment